తిరుపతి : తిరుపతిలోని వేంకటేశ్వర గోశాలను టీటీడీ (TTD) ఈవో జె.శ్యామలరావు ( EO Shyamala Rao) , జేఈవో గౌతమి శనివారం సాయంత్రం తనిఖీ చేశారు. నెయ్యి ప్లాంటు(Ghee Plant) , సెంటర్ ఫర్ ఎక్సలెన్స్, దాణా మిక్సింగ్ యూనిట్, అగరబత్తిల యూనిట్ లో చేపట్టిన ప్రోజెక్టులను పరిశీలించి నాణ్యత మెరుగుపరిచేందుకు సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.
అంతకుముందుఈవో ఛాంబర్లో గో సంరక్షణ శాల డైరెక్టర్ డాక్టర్ హరినాథ రెడ్డి గోశాల కార్యాకలాపాల పై వివరంగా పీపీటీ ఇచ్చారు. మొత్తం ఐదు గోశాలలోని పశువుల సంఖ్య, దాణా మిక్సింగ్ ప్లాంటు(Dana Mixing Plant) , అగరబత్తిల యూనిట్, నెయ్యి ట్యాంకర్లు, గుడికో గోమాత వంటి కార్యాకలాపాలను ఈవో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో సీఈ సత్య నారాయణ, ఎస్ఈలు జగదీశ్వర్ రెడ్డి, మనోహరం, వెంకటేశ్వరులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఎస్వీ మ్యూజియం అభివృద్ధి పనులు పరిశీలన
తిరుమల (Tirumala) లోని ఎస్వీ మ్యూజియంలో జరుగుతున్న అభివృద్ధి పనులను టీటీడీ అడిషనల్ ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి శనివారం పరిశీలించారు. పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో ఆరా తీశారు. వేగవంతంగా పనులు పూర్తి చేసి మ్యూజియాన్ని భక్తుల సందర్శనకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.