Tirumala | తిరుమలలో డిసెంబర్‌తో పాటు జనవరి మాసంలో శ్రీవారి ఆలయంలో పలు పర్వదినాల సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నది. వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. డిసెంబర్ 23న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనున్నది. డిసెంబర్ 29న, ఇక వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతాయని తెలిపింది. జనవరి 25న రథ సప్తమి కారణంగా ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే వీఐపీ దర్శనాలు ఉంటాయని.. ఆయా రోజుల్లో సిపారసు లేఖలపై వచ్చే వారికి బ్రేక్ దర్శనాలు ఉండవని.. దర్శనాలకు సంబంధించిన సిఫారసు లేఖలు స్వీకరించలేమని తెలిపింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సహకరించాలని తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులను కోరింది.
తిరుపతికి చెందిన లోటస్ ఎలక్ట్రిక్ ఆటో వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పేరిట అర్జున్ కొల్లికొండ అనే భక్తుడు బుధవారం టీటీడీకి రూ.10 లక్షల విలువైన సిట్రాయెన్ (ఈసీ3) ఎలక్ట్రిక్ కారును విరాళంగా అందించింది. చెన్నైకు చెందిన శరవనన్ కరుణాకరన్ అనే భక్తుడు రూ.9లక్షలు విలువైన సిట్రాయెన్ కారును విరాళంగా అందించారు. ఈ మేరకు దాతలు శ్రీవారి ఆలయం ఎదుట కార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ పేష్కార్ రామకృష్ణకు తాళాలు అందజేశారు.