Tirumala | భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలను టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి కూడా తీవ్రంగా ఖండించారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కరుణాకర్ రెడ్డికి శనీశ్వరుడి విగ్రహానికి, శ్రీ మహావిష్ణువు విగ్రహానికి తేడా తెలియడం లేదని ఎద్దేవా చేశారు.
మంగళవారం నాడు భాను ప్రకాశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అలిపిరి వద్ద శిల్పకళ క్వార్టర్స్ ఉంటుందని తెలిపారు. టీటీడీకి, శిల్పకళ క్వార్టర్స్‌కు సంబంధం లేదని స్పష్టం చేవారు. బెంగళూరుకు చెందిన భక్తుడు శనీశ్వరుడి విగ్రహానికి శిల్పకళకు ఆర్డర్ ఇచ్చాడని.. చివరకు ఆ భక్తుడు విగ్రహాన్ని తీసుకోలేదని తెలిపారు. కరుణాకర్ రెడ్డికి శనీశ్వరుడి విగ్రహానికి, శ్రీ మహావిష్ణువు విగ్రహానికి తేడా తెలియడం లేదని ఎద్దేవా చేశారు. పథకం ప్రకారమే కరుణాకర్ రెడ్డి టీటీడీపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అసత్య ప్రచారం చేసినందుకు కరుణాకర్ రెడ్డి.. భక్తులందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
16.09.2025
తిరుపతి:-అలిపిరి పాదాల చెంత ఘోర అపచారం
-మలమూత్రాలు, మద్యం బాటిల్ మధ్య మహావిష్ణు విగ్రహం
-శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా టిటిడి పాలకమండలి తీరు
-హైందవ ధర్మానికి తూట్లు పొడుస్తున్న టిటిడి పాలకవర్గం, అధికారులు
-హిందూ సంఘాలన్నీ… pic.twitter.com/UMRYMzHUAc— YSR Congress Party (@YSRCParty) September 16, 2025
తిరుమల కొండకు వెళ్లే దారిలో అలిపిరి పాదాల వద్ద శ్రీమహావిష్ణువు విగ్రహాన్ని నిర్లక్ష్యంగా పడేశారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలను టీటీడీ బోర్డు సభ్యుడు, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తీవ్రంగా ఖండించారు. టీటీడీపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
మంగళవారం నాడు ఎంఎస్ రాజు మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ సోషల్‌మీడియాలో కూడా టీటీడీపై నిరాధార వార్తలతో అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. టీటీడీపై బురదజల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీపై అసత్య ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసే ఫేక్ ప్రచారాన్ని నమ్మవద్దని భక్తులకు సూచించారు. కరుణాకర్ రెడ్డి అస్సలు హిందువే కాదని ఆరోపించారు.