తిరుమల : దివ్యక్షేత్రమైన తిరుమలలో ( Tirumala ) వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా పాదరక్షలు ( Footwear ) వేసుకుని దర్శనానికి వచ్చిన ఇద్దరు వ్యక్తుల ఘటనపై సిబ్బందిని టీటీడీ సస్పెన్షన్ ( Suspension ) చేసింది. విధులను సమర్థవంతంగా నిర్వర్తించడంలో విఫలమైన ఇద్దరు సీనియర్ అసిస్టెంట్ చక్రపాణి, జూనియర్ అసిస్టెంట్ వాసును సస్పెండ్ చేసింది.
టీటీడీ ఈవో జె.శ్యామల రావు ఆదేశాల మేరకు ఫుట్‌పాత్ హాల్, డౌన్ స్కానింగ్ పాయింట్ వద్ద విధులు నిర్వహిస్తున్న టీటీడీ సిబ్బంది, సెక్యూరిటీ గార్డులను సస్పెండ్ చేశారు. అలాగే తమ విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు సంబంధిత ఎస్పీఎఫ్ సిబ్బందిని సస్పెండ్ చేయాలని ఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్‌కు ప్రతిపాదన పంపారు.
సస్పెన్షన్ అయిన వారిలో ఐదుగురు భద్రత సిబ్బంది బాలకృష్ణ, వసుమతి, రాజేష్‌కుమార్, వెంకటేష్, బాబును విధుల నుంచి తొలగించింది. ఎస్పీఎఫ్ ఏఎస్సై రమణయ్య, సీటీలు నీలబాబు, డీఎస్‌కె ప్రసన్న, సత్యనారాయణ, పోలినాయుడు, ఎస్ శ్రీకాంత్‌ను సస్పెన్షన్‌కు ప్రతిపాదనలు పంపింది.