తిరుమల : ప్రముఖ సినీనటుడు సూపర్‌స్టార్ రజనీకాంత్ ( Rajinikanth ) శనివారం తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో భార్య లత, కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య, మనవళ్లతో కలిసి ఆలయానికి చేరుకున్న రజనీకాంత్‌కు ఆలయ అధికారులు స్వాగతం పలికారు.
అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. బెల్లం, కలకండ, ధాన్యంతో స్వామివారికి తులాభారం సమర్పించారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు రజనీ కుటుంబానికి వేదాశీర్వచనం, అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
తిరుమల శ్రీవారి హుండీకి రూ. 4.04 కోట్ల ఆదాయం
తిరుమల : ఆపద మొక్కులవాడు తిరుమల ( Tirumala ) వేంకటేశ్వరస్వామి సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి వచ్చిన భక్తులు 26 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం( Sarvadarsan ) కల్పించారు. నిన్న 67,202 మంది భక్తులు వెంకన్నను దర్శించుకోగా 25,864 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు మొక్కుల ద్వారా సమర్పించుకున్న కానుకల వల్ల హుండీకి రూ. 4.04 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు