మహబూబ్‌నగర్, డిసెంబర్ 13 : విద్యార్ధులకు ఉజ్వల భవిష్యత్‌ను అందించడమే కేఎల్ విశ్వవిద్యాలయం లక్ష్యమని యూనివర్సిటీ డీన్, ఎంహెచ్ఎస్ ప్రోగ్రాం అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ డాక్టర్ కిషోర్‌బాబు అన్నారు. ఇంటర్మీడియట్ ఉన్నత ఉద్యోగావకాశాల కోసం ‘నమస్తే తెలంగాణ’, కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ (హైదరాబాద్ క్యాంపస్) సంయుక్తంగా రిషి జూనియర్ కళాశాల విద్యార్థులకు లక్ష్యం-2026పై అవగాహన సదస్సును శనివారం మహబూబ్‌నగర్ పట్టణ సమీపంలోని తిరుమల హిల్స్‌లో ఉన్న రిషి కాలేజీ ఆవరణలో నిర్వహించారు.
కార్యక్రమానికి రిషి విద్యాలయ సంస్థల చైర్మన్ వెంకటయ్య, డీన్ భూపాల్‌రెడ్డి, మరో డీన్ లక్ష్మారెడ్డి, ‘నమస్తే తెలంగాణ’ బీఎం మహేందర్, బ్యూరో ఇన్చార్జి వెంకటేశ్వర్రావు, యాడ్స్ మేనేజర్ విజయ్‌కుమార్‌రెడ్డి హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ కిషోర్‌బాబు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని దేశ వ్యాప్తంగా ఉన్న పోటీతత్వానికి ధీటుగా వారిని తీర్చిదిద్దడంతోపాటు ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ వంటి దిగ్గజ యూనివర్సిటీలతో సమానంగా విద్యనందించడమే లక్ష్యంగా కేఎల్ యూనివర్సిటీ అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. యూనివర్సిటీ విద్యార్థులతో మూడు శాటిలైట్లను కేంద్ర ప్రభుత్వం అనుమతిలో అధికారికంగా ఆవిష్కరించినట్లు పేర్కొన్నారు.
అంతేకాకుండా అన్ని సదుపాయాలను అక్కడి కాలేజీ యాజమాన్యమే ఏర్పాట్లు చేస్తుందని, విద్యార్థులకు ఎలా ంటి ఇబ్బందులు తలెత్తవని అన్నారు. మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంగా ప్రతి సంవత్సరం రూ.100 కోట్ల విలువైన స్కాలర్షిప్ ద్వారా ఫీజులో రాయితీ కల్పిస్తున్నట్లు వివరించారు. మన దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ప్రఖ్యాత కంపెనీల్లో ప్లేస్మెంట్స్ను విద్యార్థులకు అందజేస్తున్నామన్నారు. పారిశ్రామిక, పరిశోధనాత్మక శిక్షణ, విద్యా ప్రణాళిక, ప్లేస్‌మెంట్స్ అంశాల్లో విదేశీ యూనివర్సిటీలు, కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు. పరిశోధనలకు అగ్రప్రాధాన్యం ఉందని అన్నారు. ఒక విద్యార్థి యూనివర్సిటీలో చేరుతున్న క్రమంలో క్యాంపస్‌లో లైఫ్‌ైస్టెల్ ఎలా ఉంది? స్టూడెంట్ లైఫ్ ఎలా ఉంది ? యూనివర్సిటీ ర్యాగింగ్‌లను చూసి చేరినప్పుడే వారికి సరైన న్యాయం జరుగుతుందన్నారు. ఆనంతరం రిషి విద్యాలయ కళాశాలలో టాప్ విద్యార్థులకు బహుమతులను అందజేసి అభినందించారు.

Mahabubnagar
ఇష్టంతో చదివి ఉన్నత శిఖరాలను అందుకోవాలి
విద్యార్ధులు ముఖ్యంగా మెయిన్స్‌పై దృష్టి పెట్టాలి. ఫోకస్ పెట్టి సాధించే విధంగా హార్డ్ వర్క్‌చేసి ముందుకు పోవాలి. ఇంజినీరింగ్, నీట్ కాకుండా ఇంట్రస్ట్ ఉన్న వాటిపై దృష్టి పెట్టే వాటిలో ఎలాంటి లాభాలు ఉన్నాయనే విషయం తెలియజేయడానికే ఈ ప్రోగ్రాం. ప్రతి స్టూడెంట్ ఒక గోల్ పెట్టుకొని సాధించే విధంగా కృషి చేయాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యార్థులు నిలబడాలంటే క్రమశిక్షణతో చదవాలి. అప్పుడే విజయాలు సాధించే ఆవకాశం ఉంటుంది. ఇంటర్మీడియట్ వయస్సు అంటే చాలా సమస్యలు వస్తాయి. అందులో మంచి ఏదో.. చెడు ఏదో.. గ్రహించి ముందుకు పోయినప్పుడే జీవితంలో ఎదుగుతారు. తల్లిదండ్రుల కష్టాలను గుర్తించి, కష్టంతో కాకుండా ఇష్టపడి చదివి విద్యార్థులు ఉన్నత శిఖరాలను అందుకోవాలి.
– వెంకటయ్య, రిషి విద్యాసంస్థల చైర్మన్
కేఎల్ అత్యున్నతమైన యూనివర్శిటీ
విద్యార్థులు చదువుకొనేందుకు అత్యున్నతమైన పెద్ద యూనివర్సిటీ కేఎల్‌యూ. చదువుకునే సమయంలో లక్ష్యాలు పెద్దగా పెట్టుకుని, ఆచరణ గొప్పగా ఉండాలి. క్రమ శిక్షణతో చదువుకొని తల్లిదండ్రులకు పేరు తేవాలి. లక్ష్యాలు పెద్దగా ఉంటే ‘నమస్తే తెలంగాణ’, కేఎల్ యూనివర్సిటీ, రిషి విద్యా సంస్థలు తోడ్పాటునందిస్తాయి. చదువుకుంటేనే మంచి భవిష్యత్ ఉంటుంది. ఒకప్పుడు ఏదైనా కోర్సు చదవాలంటే చాలా మందిని అడిగి సరైన నిర్ణయం తీసుకునే వారం. కానీ నేడు సోషల్ మీడియా ఎక్కువైనందున అందులో వచ్చే సమాచారం తెలుసుకొని విద్యార్థులు ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోవాలి.
– మహేందర్, బీఎం, నమస్తే తెలంగాణ
‘నమస్తే తెలంగాణ’కు కృతజ్ఞతలు
‘నమస్తే తెలంగాణ’ ఇటువంటి అవగాహన సదస్సులు పెట్టించడం చాలా సంతోషంగా ఉంది. ఇంటర్ అయిపోయాక ఏమి చేయాలో ఈ సదస్సుతో పూర్తిగా అర్థమైంది. ర్యాంక్ వస్తే ఏమి చేయాలి. రాకపోతే ఏ విధంగా ముందుకు పోవాలో తెలిసింది. లక్ష్యాలను ఏ విధంగా సాధించాలో ఈ సదస్సులో నేర్చుకున్నాను. ఈ అవగాహన సదస్సులు ఎంతో అవసరం.
– శ్రీనిధి , ఎంపీసీ సెకండియర్
విద్యార్థుల్లో భయం తొలిగిపోతుంది
ఇలాంటి అవగాహన కార్యక్రమాలతో విద్యార్థుల్లో ఉండే భయం తొలగిపోయే అవకాశం ఉంటుంది. మహబూబ్‌నగర్ వెనుకబడిన జిల్లా అని కాకుండా ఎందరో విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించి ఉన్నతంగా ఎదిగిన వారు ఉన్నారు. అందులో కొందరు మన కాలేజీ నుంచి ఉండటం రిషి విద్యాసంస్థలకు గర్వకారణం. పట్టుదలతో చదివితే మనకి అవకాశాలు వస్తాయి. ఎలాంటి ఉన్నత చదవాలి అనేవి తెలవడానికి ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడుతాయి.
– భూపాల్‌రెడ్డి, డీన్, రిషి విద్యాసంస్థలు
ఉద్యోగ కల్పనలో సాఫ్ట్వేర్ రంగమే ఫస్ట్ ప్లేస్
ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంధ్యం కారణంగా సాఫ్ట్వేర్ రంగం కొంచెం వెనుకబడిన మాట వాస్తవమే కానీ ఇప్పటికీ అత్యధిక ఉద్యోగ కల్పనలో సాఫ్ట్ వేర్ రంగం ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. అందువల్ల బీటెక్‌లో ఏ కోర్సు చదివిన అవకాశాలు ఉంటాయి. కాబట్టి బీటెక్ వల్ల ఉద్యోగాలు రావు అనే ఆలోచన చేయవద్దు.
– లక్ష్మారెడ్డి, డీన్, రిషి జూనియర్ కాలేజీ
కేఎల్‌యూ వంటివి ఉండాలి
కష్టపడ్డ వారికి ర్యాంకులు రావాలని ఏమి లేదు. పరిస్థితులు బాగాలేకపోతే ర్యాంకులు రాని వారికి కేఎల్ యూనివర్సిటీ వంటివి ఉండడం ఎంతో బలం. అంతే కాకుండా వారు అనుకున్న లక్ష్యాలు ఈ యూనివర్సిటీతో సాధ్యపడుతుందని నమ్మకం ఉన్నది. ఇది అద్భుత అవకాశాలను అందిస్తుంది. విద్యార్థులు వినియోగించుకుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
– అనిష్క, ఎంపీసీ సెకండియర్
సదస్సు బాగుంది
కేఎల్ యూనివర్శిటీ, ‘నమస్తే తెలంగాణ’ వారు ఏర్పాటు చేసిన సదస్సు ఎంతో బాగుంది. ఒక పత్రిక కేవలం వార్తలు రాయడమే కాకుండా ప్రత్యేకంగా విద్యార్థుల కోసం ఆలోచన చేసి ఇటువంటి సదస్సులు నిర్వహించినందుకు కృతజ్ఞతలు. చదివే సమయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఏ విధంగా చదవాలో నేర్చుకున్నా.