అమరావతి : కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో పలువురు తహశీల్దార్ల (MROs) ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. జోన్-4 పరిధిలోని 21 మంది ఎమ్మార్వోలను బదిలీ చేస్తూ సీసీఎన్ఏ కార్యాలయం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నేపథ్యంలో బదిలీ అయిన తహసీల్దార్లు సంబంధిత కలెక్టర్లకు రిపోర్టు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది.
ఏపీలో త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఓటర్ల నమోదులో అధికార పార్టీ బోగస్ ఓటర్ల (Bogus Voters) ను చేర్చిందని వచ్చిన ఆరోపణలపై ఎన్నికల సంఘం ఏపీపై ప్రత్యేక దృష్టిని సారించింది. ఇటీవల రెండు రోజుల పాటు ఏపీలో ఎన్నికల నిర్వహణపై సమీక్ష నిర్వహించిన కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారుల వ్యవహారంపై మొట్టికాయలు వేసింది . ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రశాంతవాతావరణంలో జరిపేందుకు అధికారులు ఇప్పటి నుంచే అన్ని చర్యలు తీసుకోవాలని సూచించింది .