అమరవాతి : ప్రతివారం దైవదర్శనానికి వెళ్తున్న ముగ్గురు మహిళలు గోదావరినదిలో (Godavari river) పడి మృతి చెందిన విషాద ఘటన కోనసీమ (Konaseema ) జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని ఆత్రేయపురం మండలం చిలకలపాడు గ్రామానికి చెందిన ముగ్గురు మహిళలు ప్రతి వారం వాడపల్లి వేంకటేశ్వరస్వామి ౯Venkateshwara Swamy ) ని దర్శించుకునేందుకు కాలినడకన బయలు దేరారు.
గోదావరి నదిని దాటుతుండగా నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో వారు అందులో చిక్కుకుని మృతి చెందారు. మృతులు అనంతలక్ష్మి, కొప్పిరెడ్డి ఏసమ్మ, కర్రి సునితగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వివరించారు.