అమరావతి : ఏపీలో ఘోర విషాదం ( Tragedy ) చోటు చేసుకుంది. కారు డోర్ లాక్పడి నలుగురు చిన్నారులు మృతి చెందారు. విజయనగరం జిల్లా ద్వారపుడిలో ఆడుకునేందుకు వెళ్తామని చెప్పి చిన్నారులు ఆగిఉన్న కారులోకి ఎక్కారు. కారు డోర్ లాక్ ( Car Door Lock) పడి ఊపిరాడక చరిష్మా(6) , మనస్విని(6), ఉదయ్(8), చారుమతి(8) అనే చిన్నారులు మృతి చెందారు. దీంతో చిన్నారుల కుటంబాల్లో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.