అమరావతి : ఏపీలోని తూర్పు గోదావరి (East Godavari ) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని ఉండ్రాజవరం మండలం సూరంపాలెంలో బుధవారం సాయంత్రం బాణాసంచా(Firecracker ) తయారి కేంద్రంలో ప్రమాదవాశాత్తు అగ్నిప్రమాదం జరిగింది.
స్థానికుల కథనం మేరకు బాణా సంచా కేంద్రంపై పిడుగు (Lightning)పడిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు ఇద్దరు మృతి మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. ఘటనా విషయాన్ని తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేసే ప్రయత్నం చేస్తున్నారు.