అమరావతి : ఏపీలోని అల్లూరి జిల్లా (Alluri District) మారేడుమిల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఏలూరు ఆశ్రమ మెడికల్ కళాశాలకు చెందిన 14 మంది వైద్య విద్యార్థులు( Medico Students) ఆదివారం మారేడుమిల్లి జలతరంగిని జలపాతాన్ని (Waterfall) సందర్శించేందుకు వచ్చారు. వీరిలో 5గురు విద్యార్థులు ప్రమాదవశాత్తు పడి జలపాతంలో పడిపోగా స్థానికులు ఇద్దరిని కాపాడారు. మరో ముగ్గురు విద్యార్థులు గల్లంతు అయ్యారు. గల్లంతైన వారిలో ఇద్దరు యువతులు, ఒక యువకుడు ఉన్నారు. గల్లంతైన ఎంబీబీఎస్ విద్యార్థుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇంకా పూర్తి వివరాలు అందవలసిఉంది.