Modi Srisailam Tour | మోదీ పర్యటనతో భారీగా ట్రాఫిక్ జామ్.. ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో 20 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
ఏపీలోని కర్నూల్ జిల్లాలో గురువారం ప్రధాని మోదీ పర్యటించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఏపీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వాహనాలను తనిఖీ చేయడంతో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యింది.
అలంపూర్ చౌరస్తా, అక్టోబర్ 16 : ఏపీలోని కర్నూల్ జిల్లాలో గురువారం ప్రధాని మోదీ (Modi Srisailam Tour) పర్యటించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఏపీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వాహనాలను తనిఖీ చేయడంతో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యింది. దాదాపు 20 కిలోమీటర్ల మేర అటు ఏపీలోని కర్నూల్ వైపు.. ఇటు తెలంగాణలోని ఉండవెల్లి మండలం పుల్లూరు నుంచి అలంపూర్ చౌరస్తా వరకు హైవే-44పై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
దాదాపు 5 గంటలపాటు వాహనాలు క్యూకట్టాయి. హైదరాబాద్ నుంచి కడప, బెంగళూరు, నంద్యాల, తిరుపతి, అనంతపూర్‌కు వెళ్లే వాహనాలను అలంపూర్ మీదుగా వంతెన ద్వారా ఏపీకి మళ్లించారు. కర్నూల్ వైపు నుంచి వచ్చే వాహనాలను నిలిపివేశారు. తర్వాత రాత్రి వరకు ట్రాఫిక్‌ను పోలీసులు క్లియర్ చేశారు. పుల్లూరు నుంచి మానవపాడు మండలం వరకు జాతీయ రహదారిపై వేల సంఖ్యలో ఆటోలు, ట్రాలీ ఆటోలు, లారీలు, బస్సులు బారులుతీరాయి. ప్రయాణికులు, చిన్నపిల్లలకు తాగేందుకు నీళ్లు కూడా దొరకక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చేసేదేమీ లేక కొందరు కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లి హోటళ్లలో భోజనం, స్నాక్స్ తిని ఆకలి తీర్చుకున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- Alampur
- Kurnool
- Pm Modi
- traffic jam
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

