తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవంగా కొలువబడుతున్న వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమల (Tirumala) , తిరుపతి ప్రాంతాలకు బాంబు బెదిరింపులు (Bomb Threat ) కొనసాగుతున్నాయి. వరుసగా ఆదివారం మూడో రోజు కూడా ఈ మెయిల్ (E mail) ద్వారా ఉగ్రవాద సంస్థల నుంచి బాంబు బెదిరింపు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
జాఫర్ సాదిక్ పేరుతో వచ్చిన పలు హోటళ్లకు(Hotels) వచ్చిన మెయిల్స్‌ను పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు హోటళ్లను, గదులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. గత రెండు రోజులుగా వస్తున్న బెదిరింపులతో పోలీసులు ఆ ప్రాంతాలను తనిఖీలు చేశారు.
ముందస్తుగా భక్తుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని పోలీసులు తనిఖీలను విస్తృతం చేశారు. వాహనాలను, వారి వద్ద బ్యాగులను తనిఖీ చేస్తున్నారు. లాడ్జీల యజమానులు గదుల కోసం వచ్చే వారి పూర్తి వివరాలు సేకరించిన తరువాతే ఇవ్వాలని పోలీసులు సూచించారు.