Tirumala | ప్రతి నెల మొదటి మంగళవారం స్థానికులకు కల్పించే దర్శనంలో భాగంగా జనవరి 5వ తేదీ ఆదివారం నాడు స్థానిక దర్శన కోటా టికెట్లను టీటీడీ జారీ చేయనుంది. తిరుపతి మహతి ఆడిటోరియంలోని కౌంటర్లలో, తిరుమల బాలాజీ నగర్ కమ్యూనిటీ హాలులో శ్రీవారి దర్శన టోకెన్లు జారీ చేయబడును.
స్థానిక కోటా కింద తిరుపతిలో 2500, తిరుమలలో 500 టికెట్లను ఇస్తున్నారు. తిరుమల, తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంటకు చెందిన ప్రజలు స్థానిక కోటా కింద శ్రీవారి దర్శన టికెట్లు పొందవచ్చు. ఇందుకోసం భక్తులు తమ ఒరిజినల్ కార్డును చూపించాల్సి ఉంటుంది. స్థానిక కోటా కింద ఒకసారి భక్తులు టికెట్లు పొందితే మళ్లీ 90 రోజుల వరకు ఈ కోటాను వినియోగించుకోలేరు.