అమరావతి : తిరుమలలో లడ్డు (Laddu) తయారిలో నెయ్యికి బదులు జంతువుల నూనెలు నిజంగా వాడి ఉంటే తక్షణం ఉన్నత స్థాయి కమిటీ వేయాలని , లేదా సీబీఐ(CBI Enquiry ) తో విచారణ జరిపించాలని ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహా పాపానికి, ఘోర అపచారానికి పాల్పడిన నీచులెవరో తేల్చాలని ఎక్స్ వేదిక ద్వారా కోరారు.
తిరుమల (Tirumala) ను అపవిత్రం చేస్తూ, హిందువుల మనోభావాలను, టీడీపీ, వైసీపీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని బండిపడ్డారు. సీఎం హోదాలో లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల నూనెలు వాడారంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తిరుమల పవిత్రతకు, ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం వేంకటేశుడికే మచ్చ తెచ్చేలా ఉన్నాయని, ఆ ఆరోపణల్లో రాజకీయ కోణం లేకుంటే, సెంటిమెంట్ మీద రాజకీయం చేసే ఉద్దేశ్యమే మీకు లేకుంటే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.