తిరుమల: తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ (Devotees crowd)విపరీతంగా పెరిగింది. వరుస సెలవుల కారణంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్ట్మెంట్లు (Compartments)నిండిపోగా అల్వర్ ట్యాంక్ గెస్ట్‌హౌజ్ వరకు భక్తులు బయట వేచియున్నారు. టోకెన్లు(Tokens) లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం(Sarvadarsan) కలుగుతుందని అధికారులు తెలిపారు.
శుక్రవారం 85,450 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 43,862 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం(Hundi income) రూ. 4.21 కోట్లు వచ్చిందని వివరించారు.
శ్రీవారిని దర్శించుకున్న ఏపీ సీఎస్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి( Chief Secretary) డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి ఆదివారం సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశ్విరచనాలు అందజేయంగా ఆలయ డిప్యూటీ ఈవో రమేశ్‌బాబు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.