అమరావతి : తిరుమల( Tirumala)లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 15 కంపార్ట్మెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం(Sarvadarsan)కలుగుతుందని టీటీడీ అధికారులు(TTD Officials) వివరించారు.
నిన్న స్వామివారిని 78,349 మంది భక్తులు దర్శించుకోగా 39,634 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం(Hundi Income) రూ. 4.56 కోట్లు వచ్చిందని పేర్కొన్నారు.
మే 28న శ్రీ భోగశ్రీనివాసమూర్తికి ప్రత్యేక సహస్ర కలశాభిషేకం
తిరుమల శ్రీవారి ఆలయంలోని శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి మే 28వ తేదీన ప్రత్యేకంగా సహస్రకలశాభిషేకం నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి 8.30 గంటల మధ్య శ్రీవారి ఆలయంలోని బంగారువాకిలి చెంత భోగ శ్రీనివాసమూర్తికి ఏకాంతంగా సహస్రకలశాభిషేకం నిర్వహిస్తారని చెప్పారు.