అమరావతి : ఏపీలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ( Road Accident) ముగ్గురు యువకులు మృతి చెందారు. గుర్తు తెలియని వాహనం ఢీ కొనగా ద్విచక్రవాహనంపై ఉన్న యువకులు చనిపోయారు. ఏలూరు జిల్లా భీమడోలు మండలం సూరప్పగూడెం వద్ద జరిగిన ప్రమాదంలో ద్వారకా తిరుమలకు చెందిన సయ్యద్ రఫీ(19), శ్రీరామ్(22), తిమ్మాపూర్‌కు చెందిన చరణ్‌కుమార్ (26) దుర్మరణం చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని భీమడోలు సర్కిల్ ఇన్స్‌స్పెక్టర్ విల్సన్ వెల్లడించారు.