Mahbub Ali Zaki : క్రికెట్ మైదానంలో విషాదం నెలకొంది. ఢాకా క్యాపిటల్స్ (Delhi Capitals) జట్టు అసిస్టెంట్ కోచ్ మహబూబ్ అలీ జకీ (Mahbub Ali Zaki) హఠాత్తుగా మరణించాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL) మ్యాచ్ సమయంలో ఉన్నట్టుండి కుప్పకూలిన ఆయన 50 ఏళ్ల వయసులో కన్నుమూశాడు. తమ కోచ్‌ను బతికించుకునేందుకు క్యాపిటల్స్ యాజమాన్యం ఆయనను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. దాంతో.. ఢాకా క్యాపిటల్స్ ఆటగాళ్లు, సిబ్బంది సహా యావత్ క్రీడాలోకం షాక్‌కు గురైంది.
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో శనివారం ఢాకా క్యాపిటల్స్‌కు తొలి మ్యాచ్. సిల్హెట్ అంతర్జాతీయ మైదానంలో మ్యాచ్‌కు ముందు మహబూబ్ అలీ జకీ పిచ్ వద్దకు వెళ్లి పరిశీలించిన ఆయన.. మ్యాచ్ చూస్తూ చూస్తూ కిందపడిపోయాడు. అలీ అలా పడిపోవడం చూసిన సహాయక సిబ్బంది, వైద్య బృందం వెంటనే కార్డియోపల్మొనరీ రిసాసిటేషన్( సీపీఆర్) ఆయన ప్రాణాలకు కాపాడేందుకు చేశారు.
The Bangladesh Cricket Board deeply mourns the passing of Mahbub Ali Zaki (59), Specialist Pace Bowling Coach of the BCB Game Development Department and Assistant Coach of Dhaka Capitals in the Bangladesh Premier League (BPL) T20 2026.
He passed away today, 27 December 2025, in… pic.twitter.com/p1ImtCNX0G
— Bangladesh Cricket (@BCBtigers) December 27, 2025
అయినా ఆయనలో చలనం లేకపోవడంతో హుటాహుటిన అంబులెన్స్‌లో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే… అప్పటికే అలీ చనిపోయాడని వైద్యులు తెలిపారు. అసిస్టెంట్ కోచ్‌గా సేవలందిస్తున్న అలీ మరణవార్తను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్ ఫిజీషియన్ డెబాషిశ్ చౌదరీ మీడియాకు వెల్లడించాడు. గతంలో అలీకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని.. ఆయన మరణం అందర్నీ షాక్‌కు గురిచేసిందని డెబాశిష్ చెప్పాడు.
A Minute of Silence in Memory of Mahbub Ali Zaki 📷
Players, officials, and the entire cricketing fraternity observed a 1-minute silence to pay their respects to Mahbub Ali Zaki, honoring his life, legacy, and invaluable contribution to Bangladesh cricket pic.twitter.com/IqlTV8Azy2— Bangladesh Cricket (@BCBtigers) December 27, 2025
మాజీ పేసర్ అయిన మహబూబ్ అలీ జకీ వీడ్కోలు తర్వాత కోచ్ అవతారమెత్తాడు. 2008లో హై పెర్ఫార్మెన్స్ కోచ్‌గా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులో చేరిన ఆయన.. సీనియర్ పేసర్ తస్కిన్ అహ్మదద్కు తర్ఫీదునివ్వడం ద్వారావెలుగులోకి వచ్చిన అలీ అకాల మరణం బంగ్లా క్రికెట్‌కు తీరని లోటు అని విశ్లేషకులు, మాజీ క్రికెటర్లు అంటున్నారు. అలీ మృతిపట్ల బంగ్లా బోర్డు సంతాపం తెలిపింది.