Suicide | ఏపీలోని కృష్ణా జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. గూడూరు మండలం అనంతయ్యపేటలోని ఒకే ఇంట్లో ముగ్గురు మహిళలు ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది.
మృతులను అనుముకొండ రజిని (60), ఆమె కుమార్తె తోట గౌరి(40), కోడలు మధు(35)గా పోలీసులు గుర్తించారు. ఒకే ఇంట్లో ముగ్గురు మహిళలు ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు మహిళల మృతదేహాలకు పంచనామా నిర్వహించిన పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబసమస్యల కారణంగానే వీరు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని ప్రాథమికంగా భావిస్తున్నాయి. అయితే అసలు కారణాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుల కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.