అమరావతి : కర్నూలు (Kurnool )జిల్లా నందవరం మండలం ధర్మాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) ముగ్గురు మహిళలు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఎమ్మిగనూరు నుంచి మంత్రాలయం వెళ్తున ఆటోను వెనుక నుంచి అతి వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టింది. దీంతో ఆటోలో ఉన్న హాలహర్వికి చెందిన గౌరమ్మ(60), నాగమ్మ(65), మంత్రాలయానికి చెందిన బీబీ(32) అనే మహిళ అక్కడికక్కడే దుర్మరణం చెందింది.
ఈ ప్రమాదంలో ఎనిమిదేండ్ల బాలిక తీవ్రంగా గాయపడగా ఆమెను కర్నూలు ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శవ పంచనామా నిర్వహించి కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.