అమరావతి : ఏపీలోని కృష్ణా జిల్లాలో (Krishna District) శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident ) ముగ్గురు మృతి చెందారు. కంకిపాడు మండలం పునాదిపాడు వద్ద కారు, వ్యాను ఢీకొనగా ఈ ప్రమాదం జరిగింది. కారులో ఉన్న ముగ్గురు మృతి చెందగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
వ్యాన్ క్యాబిన్లో చిక్కుకున్న డ్రైవర్ (Driver) ను రక్షించేందుకు స్థానికులు, పోలీసులు తీవ్రంగా ప్రయత్నించి బయటకు తీశారు. అనంతరం అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు.