అమరావతి : ఏపీలోని కాకినాడ ( Kakinada) జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది . జిల్లాలోని కత్తిపూడి జాతీయ రహదారిపై శనివారం ఉదయం ఆగిఉన్న లారీని వెనుక నుంచి వచ్చిన కారు వేగంగా వచ్చి ఢీ కొట్టింది.
దీంతో కారులో ఉన్న ఇద్దరు మహిళలు అక్కడికక్కడే చనిపోగా ఒకరు చికిత్స పొందుతూ మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పోలీసులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. వీరి పరిస్థితి విషమంగా ఉందని , కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. భీమవరం నుంచి అన్నవరం దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.