ప్రకాశం: తిరుమల (Tirumala) శ్రీవారి దర్శనానికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. పల్నాడు జిల్లా పుడుగురాళ్లకు (Piduguralla) చెందిన ఓ కుటుంబం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి మినీ వ్యాన్లో బయల్దేరారు. ఈ క్రమంలో ప్రకాశం (Prakasam) జిల్లా చాకిచెర్ల వద్ద వారు ప్రయాణిస్తున్న వ్యాన్ను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.