అమరావతి : ఏపీలోని కాకినాడ జిల్లాలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) లో ముగ్గురు అన్నదమ్ములు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. జిల్లాలోని గండేపల్లి మండలం మురారి జాతీయ రహదారి (National Highway) పై ఒకే వాహనంపై వెళ్తున్న నలుగురిని గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి వచ్చి ఢీ కొట్టింది. కూలి పని కోసం నర్సిపట్నం వెళ్లి తెల్లవారుజామున ఇంటికి వెళ్తుండగా వాహనం అదుపతప్పి రోడ్డుపై పడ్డారు.
అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న వాహనం వీరిని ఢీ కొట్టడంతో అన్నదమ్ములు రాజు, ఏసు, అఖిల్ మృతి చెందగా వీరి తల్లి దుర్గ తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఆమెను రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.