అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాచార హక్కు చట్టానికి(RTI) ముగ్గురు కమిషనర్ల (Commissioners) ను నియమించింది. ఈ మేరకు ఏపీ చీఫ్ సెక్రెటరీ జవహర్ రెడ్డి శుక్రవారం నియామక ఉత్తర్వులను విడుదల చేశారు. ఆర్టీఐ కమిషనర్లుగా జర్నలిస్ట్ రెహానా బేగం(Rehana Begum), డాక్టర్ ఉదయ్ భాస్కర్ రెడ్డి, క్రీడాకారుడు సునీల్‌ను నియమిస్తు జీవో విడుదల చేసింది. వీరు బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి మూడేళ్ల పాటు ఆర్టీఐ కమిషనర్లుగా కొనసాగుతారని స్పష్టం చేసింది. ఆంధ్ర ప్రదేశ్ విభజన జరిగిన తర్వాత తొలి మహిళా ఆర్టీఐ కమిషనర్‌గా రెహానా బేగంను నియమించడం గమన్హారం.