అమరావతి : ఎక్స్ప్రెస్ రైలులో చోరీకి పాల్పడ్డ దొంగలపై పోలీసులు కాల్పులు జరిపిన ఘటన ఆంధ్రప్రద్శ్లో చోటు చేసుకుంది. చెంగల్పట్టు నుంచి (Bapatla) కాకినాడకు వెళ్తున్న సర్కార్ ఎక్స్ప్రెస్ ( Sircar Express ) రైలులో మంగళవారం తెల్లవారుజామున దొంగలు చోరీ ( Theft ) కి పాల్పడ్డారు. ప్రయాణికుల నుంచి 5 తులాల బంగారు ఆభరణాలు అపహరించారు.
గమనించిన ప్రయాణికులు చైన్ లాగి కేకలు వేయడంతో దొంగలు పారిపోయారు. స్పందించిన రైల్వే పోలీసులు దోపిడీ దొంగలపై కాల్పులు ( Firing ) జరిపడంతో తప్పించుకుని పారిపోయారు. అయితే అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.