హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్‌లో పలు సంక్షేమ పథకాల పేర్లను మార్చుతూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనను పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్‌గా, జగనన్న విదేశీ విద్యాదీవెనను అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధిగా, వైఎస్సార్ కల్యాణమస్తును చంద్రన్న పెళ్లికానుకగా మార్చుతున్నట్టు ఉత్వర్వుల్లో పేర్కొంది.