అమరావతి : అనంతపురం(Ananthapuram) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వైసీపీకి(YCP) ఓటు వేసిందన్న కోపంతో ఓ ప్రబుద్ధుడు కన్న తల్లిని హత్యSon killed his mother) చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ విషాదకర సంఘటన అనంతపురం జిల్లా కంబదూరు మండలం ఎగువపల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..ఎగువపల్లి గ్రామానికి చెందిన వడ్డే సుంకమ్మకు(45) కుమారుడు వడ్డే వెంకటేశులు ఉన్నాడు. అతడు తెలుగుదేశంలో పార్టీలో(TDP) పని చేస్తున్నట్లు సమాచారం.
కాగా, సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేశానని మాటల సందర్భంలో సుంకమ్మ కొడుకుకు తెలిపింది. దీంతో కోపంతో ఊగిపోయిన వెంకటేశులు మద్యం సేవించి ఇంటికి వచ్చి తల్లితో గొడవకి దిగాడు. మాటమాట పెరిగి క్షణికావేశంలో కన్నతల్లి తలపై ఇనుప సుత్తితో బాది హత్య పరారయ్యాడు. సమాచారం అందుకున్న కంబ దూరు పోలీసులు హత్య జరిగిన ప్రాంతానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న వడ్డే వెంకటేశులు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.