అమరావతి : తిరుపతి జిల్లాలో ఆర్టీసీ బస్సు (AP RTC) ప్రయాణికులకు పెనుప్రమాదం తృటిలో తప్పింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలు కాగా మరో 32 మందికి స్వల్పగాయాలయ్యాయి. గురువారం తిరుపతి(Tirupati) జిల్లా చిత్తకూరు మండలం మోమిడి సమీపంలో 35 మంది ప్రయాణికులతో ఆర్టీసీ బస్సు నెల్లూరు(Nellore( నుంచి ముత్తుకూరు మీదుగా కోటకు బయలు దేరింది. ఎదురుగా వచ్చిన ఆటోను తప్పించబోయిన బస్సు పంటపొలాల్లోకి దూసుకెళ్లింది.
బస్సులో ఉన్న ముగ్గురు తీవ్రంగా గాయపడగా మరో 32 మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను గూడురు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. పోలీసులు, ఆర్టీసీ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.