అమరావతి : నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. దుండగులు ఓ వృద్ధురాలిని దారుణంగా హత్య చేశారు. జిల్లాలోని జలదంకి గ్రామం వద్ద వృద్ధురాలు కొండమ్మను దుండగులు గొంతుకోసి హత్య చేశారు. ఆమె ఒంటిపై ఉన్న 15 సవర్ల బంగారు నగలను దోచుకెళ్లారు. గ్రామంలోని విద్యుత్ ఉప కేంద్రం వద్ద దుకాణం నిర్వహించి జీవనం కొనసాగిస్తున్న ఆమెను హత్య చేయడం గ్రామంలో విషాదం నెలకొన్నది . పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.