అమరావతి : ఏపీలోని అల్లూరి జిల్లాలో (Alluri District ) విషాదం చోటు చేసుకుంది . జిల్లాలోని అడ్డతీగల మండలం తిమ్మాపురంలో ఇసుక కోసం వాగులోకి దిగిన యువకులు నలుగురు గల్లంతయ్యారు (Missing). అనధికారికంగా క్వారీలో దిగిన కాకినాడ (Kakinada) జిల్లా ఏలేశ్వరం వాసులు భూషణం, బాబు, గొంతయ్య, శ్రీను గల్లంతయ్యారు. ఘటనా స్థలాన్ని రంపచోడవరం డీఎస్పీ సాయిప్రశాంత్ (DSP Saiprashanth) సందర్శించారు. గల్లంతైన యువకుల కోసం పోలీసులు ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు మొదలు పెట్టారు .