అమరావతి : ఈనెల 10 నుంచి తిరుమలలో (Tirumala ) ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు (Vaikunta Dwara Darsan) ముగుస్తుండడంతో టోకెన్ల జారీ ప్రక్రియను టీటీడీ నేటితో ముగించనుంది. వైకుంఠ ద్వార దర్శనం ఎస్ఎస్డి టోకెన్లపై టీటీడీఈవో జె.శ్యామలరావు పలు సూచనలు చేశారు.
జనవరి 20న దర్శనం కోరే భక్తులకు జనవరి 19న ఎస్ఎస్డీ టోకెన్లు జారీ ఉండదని స్పష్టం చేశారు. భక్తులు సర్వదర్శనం క్యూ లైన్లో మాత్రమే శ్రీవారి దర్శనం చేసుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు. అదేవిధంగా, జనవరి 20న టీటీడీ ప్రోటోకాల్ భక్తులను మినహాయించి వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేశామని ఆయన వివరించారు. ఈ కారణంగా జనవరి 19న వీఐపీ బ్రేక్ దర్శనం కోసం ఎటువంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవన స్పష్టం చేశారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న స్వామివారిని 67,115 మంది భక్తులు దర్శించుకోగా 16,656 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 4.03 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.
Also Read :
Maha Kumbhmela | మహా కుంభమేళాలో శ్రీవారికి వైభవంగా స్నపన తిరుమంజనం
ఏప్రిల్ నెల కోటా ఆర్జిత సేవా టికెట్ల షెడ్యూల్ ఖరారు