తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు రావడంతో 17 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం లభిస్తుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 76,229 మంది దర్శించుకోగా 31,381 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.46 కోట్లు వచ్చిందని తెలిపారు.
తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జరుగుతున్న హోమ మహోత్సవాల్లో భాగంగా సుబ్రహ్మణ్యస్వామివారి హోమం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా యాగశాలలో గణపతి పూజ, పుణ్యాహవాచనం, కలశ స్థాపన, అగ్ని ప్రతిష్ట, సుబ్రహ్మణ్యస్వామి వారి హోమం, పూర్ణాహుతి, నివేదన, హారతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో దేవేంద్రబాబు, ఏఈవో పార్థసారథి, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.