తిరుమల : తిరుమల (Tirumala ) కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు భక్తుల (Pilgrims) సంఖ్య నానాటికి పెరుగుతుంది. గత జూలై నెల (July month) లో స్వామివారిని 22 లక్షల 13 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం (Hundi Income) రూ. 125.35 కోట్లు వచ్చిందని టీటీడీ (TTD) అధికారులు వివరించారు.
1.04 కోట్ల లడ్డూలను విక్రయించామని, 24.04 లక్షల మంది భక్తులకు అన్న ప్రసాదం (Annaprasadam) అందజేశామని తెలిపారు. 8.67 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారని వివరించారు. కాగా గురువారం 61,465 మంది భక్తులు తిరుమలను దర్శించుకోగా 21,206 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.66 ఆదాయం వచ్చిందన్నారు. స్వామివారి దర్శనానికి 12-15 గంటల సమయం పడుతుందని తెలిపారు.
Dhavaleswaram | ధవళేశ్వరం ఆనకట్ట వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ