అమరావతి : గోదావరి ఉధృతి తగ్గుముఖం పట్టడంతో తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం(Dhavaleswaram) ఆనకట్ట వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను (First danger warning ) అధికారులు ఉపసంహరించారు (Withdraw). ప్రస్తుతం ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 11.5 అడుగుల నీటి మట్టం ఉంది. సముద్రంలోకి 9.52 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని అధికారులు వివరించారు.
నంద్యాల జిల్లాలోని శ్రీశైలం(Srisailam) జలాశయానికి చెందిన 10 గేట్లు 20 అడుగుల వరకు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం ఇన్ఫ్లో 4.82 లక్షల క్యూసెక్కులు నీరు వస్తుండగా 5.28 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం గరిష్ట నీటిమట్టం 885 అడుగులకు గాను 883.5 అడుగుల వరకు నీరు ఉంది. గరిష్ఠ నీటి నిల్వ 215.8 టీఎంసీలకు గాను ప్రస్తుతం ప్రాజెక్టులో 207.4 టీఎంసీల నీరు నిలువ ఉందని అధికారులు వివరించారు.