AP CM Jagan | ప్రభుత్వ పథకాలను నిలిపివేసిన ఢిల్లీ పెద్దలకు ఓటుతో బుద్ధి చెప్పాలి : ఏపీ సీఎం వైఎస్ జగన్
AP CM Jagan | ఏపీలో మరో మూడు రోజుల్లో కురుక్షేత్ర యుద్ధం జరుగబోతుందని, ఈ ఎన్నికల్లో కూటమి ఇచ్చే డబ్బులకు మోసపోవద్దని ఏపీ సీఎం వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.
అమరావతి : ఏపీలో మరో మూడు రోజుల్లో ఎన్నికల కురుక్షేత్ర యుద్ధం జరుగబోతుందని ఏపీ సీఎం వైఎస్ జగన్ (AP CM Jagan) తెలిపారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను మాత్రమే ఎన్నుకునేందుకు జరుగుతున్న ఎన్నికలు కావని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను నిలిపివేసిన ఢిల్లీ పెద్దలకు ఓటుతో బుద్ధి చెప్పాలని, ఈ ఎన్నికల్లో కూటమి ఇచ్చే డబ్బులకు మోసపోవద్దని కోరారు.
రాబోయే ఐదేళ్ల ఇంటింటి అభివృద్ధి, పథకాల కొనసాగింపును నిర్ణయించే ఎన్నికలను అన్నారు.విద్యార్థులకు ట్యాబ్‌లు వసతి దీవేన, రైతులకు పెట్టుబడి సాయం, పగటిపూటనే 9 గంటల పాటు ఉచిత విద్యుత్ , ఆర్బీకే (RBK) వ్యవస్థను తీసుకొచ్చి విజయవంతంగా సంక్షేమాలను అమలు చేస్తున్నామని ప్రకటించారు.
చంద్రబాబు హయాంలో ఏ ఒక్కటి పేదలకు గుర్తింపు ఉండిపోయేలా పథకం చేపట్టలేదని విమర్శించారు. మేనిఫెస్టోలో సాధ్యం కాని హామీలతో చంద్రబాబు మరోసారి ఇస్తున్న మోసపు హామీలను నమ్మవొద్దని కోరారు. స్వయం ఉపాధికి అండగా ఆటోలు, టాక్సీలు నడుపుతున్న డ్రైవర్లకు వాహన మిత్ర, నేతన్నలకు నేతన్న నేస్తం, మత్స్యకారులకు మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసాతో పాటు చిన్న, చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్లకు తోడు చేదోడు పథకాలను అందిస్తున్నామని చెప్పారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

