అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ -2 ఉద్యోగాల భర్తీకి గడువును మరో వారం రోజుల పాటు పొడిగించారు. అభ్యర్థుల కోరిక మేరకు గడువును ఈనెల 17 వరకు పొడిగిస్తున్నట్లు ఏపీపీఎస్సీ(APPSC) అధికారులు వెల్లడించారు. గ్రూప్- 2 (Group -2) పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసే సమయంలో సర్వర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వాటిని సరిచేయాలని అభ్యర్థులు కమిషన్కు విన్నవించారు.
దీంతో ఈనెల 10 వరకు ఉన్న గడువును జనవరి 17 అర్ధరాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సంబంధిత అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో మొత్తం 897 పోస్టుల భర్తీకి గ్రూప్-2 నోటిఫికేషన్ గత డిసెంబర్లో విడుదల చేసింది. ఇందులో 331 ఎగ్జిక్యూటివ్, 566 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులున్నాయని తెలిపింది. ఫిబ్రవరి 25న జరిగే ప్రిలిమినరీ పరీక్ష తేదీలో మాత్రం ఎలాంటి మార్పు లేదని కమిషన్ స్పష్టం చేసింది.