Vivekam | వివేకం సినిమాపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్.. లైవ్ స్ట్రీమింగ్ కాకుండా చర్యలకు ఆదేశం
Vivekam | వైఎస్ వివేకానంద మర్డర్ అంశంతో రూపొందించిన వివేకం సినిమా విడుదలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది.
Vivekam | అమరావతి : ఏపీలో ప్రధాన పార్టీల మధ్య సినిమాల యుద్ధం కొనసాగుతుంది. అధికార వైసీపీ గత ప్రభుత్వాల ప్రతినిధులపై రెండు సినిమాలు తీస్తే తామేమి తక్కువ కాదంటూ వైసీపీ ఆగడాలపై టీడీపీ నాయకులు మరో చిత్రం తీసి విడుదల చేశారు. వైఎస్ వివేకానంద హత్య (YS Viveka Murder) కు సంబంధించిన వివరాలతో కూడిన వివేకం (Vivekam) అనే చిత్రాన్ని నిర్మించి విడుదల చేశారు.
వివేకా హత్య కేసు కోర్టులో ఉండగానే తప్పుడు రీతిలో సినిమా చిత్రీకరించారని, దీనిపై చర్యలు తీసుకోవాలంటూ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మార్చి 20న కేంద్ర ఎన్నికల సంఘానికి (Central Election Commission) ఫిర్యాదు చేశారు. రాజకీయపార్టీకి సంబంధించిన పలు సన్నివేశాల్లో వైఎస్సార్సీపీ జెండాలను పోలి ఉండేలా తీర్చిదిద్దారని , పలు పాత్రలకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్ పేరు సహా ఇతర పాత్రలను కూడా అదే పేర్లతో ఉచ్చరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ చిత్రం రాష్ట్రంలో హింసను ప్రేరేపించేలా ఉందని, ఈ సినిమాను యూట్యూబ్లో ప్రదర్శించడం, వివేకా బయోపిక్కామ్ అనే వెబ్సైట్లో లైవ్ స్ట్రీమింగ్ చేయడం సరికాదని ఫిర్యాదులో పేర్కొన్నారు. చిత్రాన్ని బ్యాన్ చేయాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం ఈ చిత్రాన్ని లైవ్ స్ట్రీమింగ్ కాకుండా తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్కు బుధవారం ఆదేశాలు జారీ చేసింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

