Loksabha Elections 2024 : ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. చెదురుమదరు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులుతీరి తమ ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు.
ఇక కడప జిల్లా జమ్మలమడుగులో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇరు వర్గాలు పోలింగ్ కేంద్రం వద్ద మోహరించి ఘర్షణకు దిగడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. ఏపీలో ఉదయం 11 గంటల వరకూ దాదాపు 23 శాతం పోలింగ్ నమోదైంది.
Read More :
Sandeshkhali | నిరసనల్లో పాల్గొనేందుకు మహిళలకు డబ్బులు.. సందేశ్‌ఖాలీ ఆందోళనలపై బీజేపీ నేత వెల్లడి