YS Sharmila arrest | విజయవాడలో ఉద్రిక్తత.. వైఎస్ షర్మిల అరెస్టు
YS Sharmila arrest | మెగా డీఎస్సీని అమలు చేయాలంటూ కాంగ్రెస్ చేపట్టిన చలో సచివాలయం కార్యక్రమం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది.
అమరావతి : మెగా డీఎస్సీని అమలు చేయాలంటూ కాంగ్రెస్ చేపట్టిన చలో సచివాలయం కార్యక్రమం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. విజయవాడలో కరకట్ట సమీపంలో కొండవీటి ఎత్తిపోతల వద్ద ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila )తో పాటు కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నడిరోడ్డుపైనే బైఠాయించిన కాంగ్రెస్ నాయకులకు పోలీసులకు, మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం కరకట్ట వద్ద పోలీసులు మోహరించి షర్మిలను పోలీసు వ్యాన్లో ఎక్కించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. షర్మిల మాట్లాడుతూ మెగా డీఎస్పీ అంటూ ఏపీ ప్రభుత్వం దగా డీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేసిందని ఆరోపించారు.
ప్రజాస్వామ్యబద్దంగా వినతిపత్రం ఇవ్వడానికి వెళితే అక్రమంగా అరెస్టు (YS Sharmila arrest) చేయడం దారుణమని పేర్కొన్నారు. చలో సచివాలయం పిలుపులో భాగంగా పోలీసులు ముందస్తు కాంగ్రెస్తో పాటు వామపక్ష నాయకులను అదుపులోకి తీసుకున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

