గురువారం 29 అక్టోబర్ 2020
Andhrapradesh-news - Sep 27, 2020 , 20:56:25

ఆల‌యాల హుండీ దొంగ‌ల ముఠా ప‌ట్టివేత‌

ఆల‌యాల హుండీ దొంగ‌ల ముఠా ప‌ట్టివేత‌

విశాఖ‌ప‌ట్నం : ఏపీలోని విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లోని ఆల‌యాల్లో గ‌ల హుండీల‌ను ప‌గుల‌గొట్టి చోరీల‌కు పాల్ప‌డుతున్న ముఠా స‌భ్యుల‌ను ఆరుగుర్ని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. నిందితుల వ‌ద్ద నుంచి రూ. 21 వేల న‌గ‌దు, హుండీల‌ను ప‌గుల‌గొట్టే ఇనుప‌ రాడ్ల‌ను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 27 కేసుల్లోని 19 కేసుల్లో వీరు నిందితులుగా ఉన్నారు. డీఐజీ ఎల్‌కేవీ రంగారావు మీడియా ద్వారా వివ‌రాల‌ను తెలిపారు. శనివారం రాత్రి విజయనగరం శివార్లలో ఆటోరిక్షాలోని ముఠా స‌భ్యులు అనుమానాస్ప‌ద‌కంగా సంచ‌రిస్తున్నారు. వీరిని నైట్ పెట్రోలింగ్ పోలీసులు ఆపేందుకు చూడ‌గా త‌ప్పించుకునేందుకు ప్ర‌య‌త్నించారు. ముఠా సభ్యులు నగరంలోని మధురవాడ వాంబే కాలనీలో నివసిస్తున్న‌ట్లు తెలిపారు. ఆల‌యాల‌పై దాడుల‌ను త‌ప్పుగా ప్ర‌చారం చేసినా అదేవిధంగా వాటిని వ్యాప్తి చేసినా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని డీఐజీ హెచ్చ‌రించారు. ఊద‌హర‌ణ‌గా ఆయ‌న ఓ సంఘ‌ట‌న‌ను వివ‌రించారు. శ్రీకాకుళంలో సరస్వతి విగ్రహం ఇటీవల వర్షాలకు విగ్ర‌హ అవయవాలు విరిగిపోయాయి. కానీ కొంత మంది ఈ సంఘ‌ట‌న‌ను మత విద్వేషాన్ని రేచ్చ‌గొట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నార‌న్నారు. 


logo