హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల వేళ కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి (Avinash Reddy) భారీ ఊరట లభించింది. వైఎస్ వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఆయన బెయిల్ రద్దుచేయాలంటూ దస్తగిరి వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.
అదేవిధంగా ఈకేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డికి హైకోర్టు పూర్తిస్థాయి బెయిల్ మంజూరు చేసింది. అయితే మరో ఇద్దరు నిందితులైన ఉదయ్ కుమార్ రెడ్డి, సునీల్ యాదవ్‌కు బెయిల్ నిరాకరించింది. కాగా, అవినాశ్‌రెడ్డికి గతేదడాని మే 31న హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.