Pawan kalyan | తెలంగాణ ముమ్మాటికి ఆ ప్రాంత భూమి పుత్రులదేనని జనసేన చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. తెలంగాణ మీ జాగీరా..? అంటూ హైదరాబాద్‌లోని నివాసంలో ఏర్పాటుచేసిన ప్రెస్మీట్లో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపాయని తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పలువురు నేతలు పవన్ కల్యాణ్ కామెంట్స్‌పై తమదైన శైలిలో కౌంటర్ అటాక్ చేశారు.
కాగా అమరావతిలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ.. తాను తెలంగాణ ప్రజలను ఉద్దేశించి చెడుగా మాట్లాడలేదన్నారు. తెలంగాణలో పోటీపై ముందస్తు ప్రణాళికలు ఏమీ లేవన్నారు. దేశ సమగ్రతను దెబ్బతీసే విధంగాఎవరూ వ్యవహరిచవద్దు. ప్రాంతీయ వాదం వేరు.. ప్రత్యేక రాష్ట్రం కోరుకోవడం వేరు. కేటీఆర్ నాకు సోదరుడి లాంటి వారన్నారు.
విభజించుకుంటూ వెళ్తే ఎక్కడికి వెళ్తాం. భూమికి సరిహద్దులు ఉంటాయి. మనసుకు ఉండదు. ఏపీ నుంచి వెళ్లి తెలంగాణలోఎవరూ పోటీ చేయడం లేదు. జనసేనలోని తెలంగాణ భూమి పుత్రులే అక్కడ పోటీ చేస్తామంటున్నారు. తెలంగాణలో ఇంకా తెలంగాణ నినాదం, తెలంగాణ ఉనికి ఉంది. మా తెలంగాణ నేతలుపోరుపెడితే అక్కడికి వెళ్లాను. పుష్కరకాలం తర్వాత కూడా అంత ద్వేషం ఉంటుందని ఊహించలేదన్నారు పవన్ కల్యాణ్ .
ఏపీలో మాత్రం ఆంధ్రా అనే ఉనికి లేదని.. రాజకీయాల్లో కులదూషణలు ఎక్కువయ్యాయి. ఎక్కడైనా తప్పు జరిగితే కులం పేరుతో దూషిస్తున్నారని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. కులదూషణలకు ముగింపు పలకాలని జనసేన నిర్ణయించింది. సేనాగళం అనే కమిటీని ఏర్పాటు చేశాం. దేశంలోబతకడం మన హక్కు. దీన్ని కాలరాసే హక్కు ఎవరికీ లేదు. కశ్మీరీ పండిట్లను ఆ ప్రాంతం నుంచి వెళ్లగొడితే ఏమైంది. 2014 నుంచి 2024 మధ్య ఎంతమంది తెలంగాణ కాంట్రాక్టర్లు ఏపీకి రాలేదన్నారు పవన్ కల్యాణ్ .
ఏపీలో ఒక మాట తెలంగాణలో ఒక మాట మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్
తెలంగాణ అనే ప్రాంతీయ వాదం ఇంకెన్నాళ్ళు అంటూ తెలంగాణలో వ్యాఖ్యలు
తెలంగాణలో ఇంకా తెలంగాణ ఉనికి, భావోద్వేగం ఉన్నాయి, కానీ ఆంధ్రాలో ఆ ఉనికి లేదు అంటూ ఏపీలో వ్యాఖ్యలు https://t.co/DfMLpxYsPY pic.twitter.com/bY2K4Rnjqp
— Telugu Scribe (@TeluguScribe) June 3, 2026
Small Habits | రోజువారీ జీవితంలో చాలా మంది చేసే చిన్న చిన్న పొరపాట్లు ఇవే.. వీటిని చేయకూడదు..
Nallagonda | డీసీఎంను ఢీ కొట్టిన మినీ ట్రావెల్ బస్సు..ఒకరు మృతి, 13 మందికి గాయాలు
Rayapol | ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల రాస్తారోకో..భారీగా ట్రాఫిక్ జామ్