దుమ్మురేపిన బుల్ రన్
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఏడోరోజూ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ఉన్నప్పటికీ.. భారతీయ సూచీలు మాత్రం పరుగులు పెట్టాయి. ఈ క్రమంలోనే శుక్రవారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 1,718.01 పాయింట్లు లేదా 2.17 శాతం ఎగబాకి మరోమారు 81వేల మార్కు ఎగువకు చేరింది.
-
మరోమారు 25 వేల ఎగువకు నిఫ్టీ
-
మళ్ళీ81 వేల మార్కును దాటిన సెన్సెక్స్
ముంబై, నవంబర్ 6: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఏడోరోజూ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ఉన్నప్పటికీ.. భారతీయ సూచీలు మాత్రం పరుగులు పెట్టాయి. ఈ క్రమంలోనే శుక్రవారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 1,718.01 పాయింట్లు లేదా 2.17 శాతం ఎగబాకి మరోమారు 81వేల మార్కు ఎగువకు చేరింది. 81,028.02 వద్ద నిలిచింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ సైతం 493.75 పాయింట్లు లేదా 2.01 శాతం ఎగిసి 9 నెలల గరిష్ఠాన్ని తాకుతూ 25,030.35 దగ్గర స్థిరపడింది. ఈ ఏడాది ఫిబ్రవరి 2న 25,088.40 వద్ద ముగిసింది.
మళ్లీ ఇప్పుడే ఆ స్థాయి దరిదాపుల్లోకి సూచీ వెళ్లడం గమనార్హం. కాగా, గడిచిన మూడేండ్లలో ఎన్నడూలేనంతగా 7 రోజుల్లో సెన్సెక్స్ 7,781.99 పాయింట్లు లేదా 10.62 శాతం, నిఫ్టీ 2,331.5 పాయింట్లు లేదా 10.27 శాతం పుంజుకున్నాయి. మదుపర్ల సంపద రూ.30 లక్షల కోట్లకుపైగానే పెరుగగా.. బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ విలువ తొలిసారి రూ.500 లక్షల కోట్ల మార్కును అధిగమించింది. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు వ్యతిరేకంగా ఫలితాలు రావడం దేశ, విదేశీ మార్కెట్లలోని ఇన్వెస్టర్లను ఉత్సాహపర్చింది. ట్రంప్ దుందుడుకు నిర్ణయాలు..
అమెరికానేగాక, ప్రపంచ ఆర్థిక వ్యవస్థనూ దెబ్బతీస్తున్నాయి మరి. దీంతో ఇకనైనా ఇరాన్‌తో యుద్ధం ఆగుతుందన్న అభిప్రాయాలు మార్కెట్‌వ్యాప్తంగా నెలకొన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ వార్‌తోనే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భగ్గుమన్న సంగతి విదితమే. ముఖ్యంగా దేశీయ ఇంధన అవసరాలు దాదాపు 90 శాతం దిగుమతుల ద్వారానే తీరుతున్న నేపథ్యంలో ట్రంప్ ఓటమి.. భారతీయ మార్కెట్లకు బాగా కలిసొచ్చిందన్న విశ్లేషణలు ఎక్స్పర్ట్స్ నుంచి వ్యక్తమవుతున్నాయి.
సెన్సెక్స్ షేర్లలో..
మహీంద్రా అండ్ మహీంద్రా షేర్ విలువ గరిష్ఠంగా 6.15 శాతం పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం (2026-27) రెండో త్రైమాసికానికి (జూలై-సెప్టెంబర్)గాను కంపెనీ ప్రకటించిన ఆర్థిక ఫలితాలు మదుపర్లను మెప్పించాయి. ఐసీఐసీఐ బ్యాం క్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టైటాన్, యాక్సిస్ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లూ ఆకట్టుకున్నాయి. మొత్తం 30 షేర్లలో పవర్ గ్రిడ్ మాత్రమే నష్టాలను చూసింది. అలాగే బీఎస్ఈ మిడ్‌క్యాప్ సెలెక్ట్ ఇండెక్స్ 0.23 శాతం పెరుగగా.. స్మాల్‌క్యాప్ సెలెక్ట్ ఇండెక్స్ 0.92 శాతం క్షీణించింది. రంగాలవారీగా.. బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ సూచీలు పెరిగాయి. ఈ వారం సెన్సెక్స్ 6,568.49 పాయింట్లు, నిఫ్టీ 1,977.25 పాయింట్లు చొప్పున పెరిగాయి. ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా, జపాన్, చైనా, హాంకాంగ్ సూచీలు నష్టాలకే పరిమితమయ్యాయి.
సంవత్ 2082.. ప్చ్
శుక్రవారంతో ముగిసిన సంవత్ 2082లో దేశీయ స్టాక్ మార్కెట్ల ప్రదర్శన తీవ్రంగా నిరాశపర్చింది. గత 15 ఏండ్లలో ఎప్పుడూ లేనంతగా సూచీలు ఈసారి నష్టపోయాయి మరి.v సెన్సెక్స్ 8.4 శాతం, నిఫ్టీ 7.3 శాతం మేర పడిపోయాయి. 2067 తర్వాత ఈ ఏడాదే సూచీలు ఇంత ఎక్కువగా నష్టాలను చవిచూశాయి. నాడు 17 శాతం పతనాన్ని మూటగట్టుకున్నాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 28 శాతం, స్మాల్‌క్యాప్ 100 25 శాతం చొప్పున క్షీణించాయి. అయితే ఈ ఏడాది మాత్రం 0.3 శాతం, 4.5 శాతం మేర లాభపడ్డాయి.v సంవత్ 2082లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) రూ.3.03 లక్షల కోట్ల పెట్టుబడుల్ని ఉపసంహరించుకున్నారు. అయితే దేశీయ సంస్థాగత మదుపర్లు (డీఐఐ) రూ.7.74 లక్షల కోట్ల పెట్టుబడుల్ని పెట్టారు.v రాబోయే సంవత్ 2083లో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టి, బాండ్ల రాబడులు పడిపోతే తప్ప.. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలను అందుకోలేవన్న అంచనాలు. పశ్చిమాసియా సంక్షోభం ముగిసేదాకా భారతీయ మార్కెట్లు ఒత్తిడిలోనే టాయన్న అభిప్రాయాలు. ఆదివారం మూరత్ ట్రేడింగ్‌తో మొదలుకానున్న కొత్త సంవత్సరం.
మార్కెట్ లాభాలకు కారణాలు
- తరలివస్తున్న విదేశీ పెట్టుబడులు
- దిగొస్తున్న ముడి చమురు ధరలు
- ఆకర్షణీయ కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు
- బలపడుతున్న రూపాయి విలువ
- మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు తగ్గుతాయన్న అంచనాలు
అమ్మకాల ఒత్తిడిలో అమెరికా మార్కెట్లు
అమెరికా మార్కెట్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇటీవలి ఎన్నికల్లో డెమొక్రాట్లదే పైచేయి కావడంతో ఇన్నాళ్లూ పరుగులు పెట్టిన డాటా సెంటర్ల నిర్మాణ పనులు మందగిస్తాయన్న ఆందోళనలు మదుపర్లలో నెలకొన్నాయి. గురువారం నాస్డాక్ (5.52 శాతం), డోజోన్స్ (3.44 శాతం), ఎస్అండ్పీ (4.36 శాతం) సూచీలు పడిపోయాయి. ఒక్కరోజే ఇంతలా దిగజారడం దాదాపు రెండేండ్లలో ఇదే తొలిసారి. ఏఐ, డాటా సెంటర్లతో ముడిపడిన షేర్లు నష్టపోతున్నాయి. ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా, స్పేస్ఎక్స్ షేర్లు భారీ నష్టాలను చవిచూశాయి. మస్క్ సంపద సుమారు రూ.40 లక్షల కోట్లు హరించుకుపోయింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

