AP News | పల్నాడు జిల్లాలో ఉద్రికత్త వాతావరణం నెలకొంది. వరద ముంపు గ్రామాల పరిశీలనకు వెళ్తున్న వైసీపీ నాయకులపై టీడీపీ శ్రేణులు విరుచుపడ్డాయి. దారి మధ్యలోనే వైసీపీ నాయకుల కాన్వాయ్‌ను ఆపి కర్రలతో దాడికి దిగారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన గ్రామాల పర్యటనకు వెళ్లేందుకు పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు సిద్ధమయ్యారు. మంగళవారం ఉదయం తన అనుచరులతో కలిసి ముంపు గ్రామాల పర్యటనకు వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు 14వ మైలు రాయి వద్ద నంబూరు కారును అడ్డుకున్నారు. ఆయన కాన్వాయ్‌పై కర్రలతో దాడికి దిగారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వారిని అడ్డుకున్నారు. ఆందోళనకారులను అక్కడి నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేశారు. కాగా, ఉద్రికత్త పరిస్థితుల నేపథ్యంలో తన పర్యటనను విరమించుకుని నంబూరు గుంటూరుకు తిరిగి వెళ్లిపోయారు.
టీడీపీ నేతలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా నంబూరి శంకరరావు మండిపడ్డారు. ముంపు ప్రాంత బాధితులను పరామర్శించడం తప్పా అని ప్రశ్నించారు. పోలీసుల సమక్షంలోనే తమపై దాడి చేశారని.. ఇదంతా ప్లాన్ ప్రకారం చేసిన దాడి అని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు చేయడం దారుణమని అన్నారు.
పల్నాడులో వైయస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యేపై దాడికి @JaiTDP గూండాలు కుట్ర
భారీ వర్షాలతో పెదకూరపాడు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి.. బాధితులను పరామర్శించడానికి వెళ్లిన వైయస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు
శంకర్రావు కోసం వేచి ఉన్న వైయస్… pic.twitter.com/QyT3uF2XPk
— YSR Congress Party (@YSRCParty) September 10, 2024