YS Jagan | విజయవాడ స్వరాజ్య మైదానంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ న్యాయ మహాశిల్పం పీఠంపై ఏర్పాటు చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును గురువారం రాత్రి తొలగించడం సంచలనంగా మారింది. ఈ దాడిని నిరసిస్తూ అంబేడ్కర్ విగ్రహం దగ్గర వైసీపీ నాయకులు నిరసనకు దిగారు. కూటమి నేతలే ఈ కుట్ర వెనుక ఉన్నారని ఆరోపించారు. ఈ క్రమంలో టీడీపీ ట్విట్టర్(ఎక్స్) వేదికగా మండిపడింది.
విదేశీ విద్య పథకానికి అంబేడ్కర్ పేరు తీసి, సైకో పేరు పెట్టడంతో, అంబేడ్కర్ పక్కన ఒక ఫ్యాక్షనిస్ట్ పేరు ఉండటం ఇష్టం లేక, దళితులకు బీపీ పెరిగి, అంబేడ్కర్ పేరు పక్కన సైకో పేరు తీసేశారని టీడీపీ తెలిపింది. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ పేరు కంటే.. జగన్ రెడ్డి తన పేరు పెద్దదిగా పెట్టించుకోవడంతో.. దళితులు జగన్రెడ్డి పేరు తీసేసి అంబేడ్కర్ విలువ పెంచారని చెప్పింది. ఈ ఘటనపై విచారణ జరుగుతుందని తెలిపింది.
అంబేద్కర్ విగ్రహానికి కానీ, ఆయన పేరుకి కానీ ఏమి అవ్వలేదని టీడీపీ స్పష్టం చేసింది. 27 దళిత పథకాలు రద్దు చేసిన, దళిత ద్రోహి జగన్ రెడ్డి పేరు పెద్దదిగా ఉండటంతో దళితులే పీకి పడేశారని పేర్కొంది. ఎవరు చేశారనే దానిపై విచారణలో పూర్తి వివరాలు తెలుస్తాయని తెలిపింది.
విదేశీ విద్య పధకానికి అంబేద్కర్ పేరు తీసి, సైకో పేరు పెట్టటంతో, అంబేద్కర్ గారి పక్కన, ఒక ఫ్యాక్షనిస్ట్ పేరు ఉండటం ఇష్టం లేక, దళితులకి బీపీలు పెరిగి, అంబేద్కర్ గారి పేరు పక్కన సైకో పేరు తీసేసారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి పేరు కంటే, జగన్ రెడ్డి తన పేరు పెద్దదిగా… https://t.co/AA4Ml88Sn8 pic.twitter.com/Tvm1YL3j6E
— Telugu Desam Party (@JaiTDP) August 9, 2024
వైసీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడ స్వరాజ్య మైదానంలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహ పీఠంపై ఆవిష్కర్త అని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును స్టీల్ అక్షరాలతో ఉంచారు. అయితే, గురువారం రాత్రి 9 గంటల తర్వాత వచ్చిన కొంతమంది దుండగులు.. అక్కడున్న వారిని బలవంతంగా పంపించేశారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహంపైకి దాడికి దిగారు. ముందుగా జగన్ పేరును తొలగించారు. ఈ తతంగం గురించి సమాచారం బయటకు పొక్కడంతో ప్రజలతో పాటు మీడియా అక్కడకు పెద్ద ఎత్తున వచ్చింది. దీంతో వారంతా అక్కడి నుంచి పరారయ్యారు. అయితే ఇదంతా టీడీపీ శ్రేణుల పనే అని వైసీసీ నేతలు ఆరోపిస్తున్నారు.