అమరావతి : ఎన్నికల నామినేషన్ల గడువు ముగియడంతో రాజ్యసభ ( Rajya Sabha) లో టీడీపీ సభ్యులు లేని పార్టీగా గుర్తింపు పొందనుంది . 41 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో రాజ్యసభలో టీడీపీ (TDP) నాయకులు సభ్యులుగా ఎన్నికవుతూ వచ్చారు. అయితే ఈసారి మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి ఎదురవడం ఇదే తొలిసారి .
ఏపీలో ఉన్న ముగ్గురు రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర (Kanakamedala Ravindra) (టీడీపీ) , బీజేపీ సభ్యుడు సీఎం రమేశ్(CM Ramesh), వైఎస్సార్ సీపీ సభ్యుడు వేమిరెడ్డి (Vemireddy) ల పదవి కాలం ఏప్రిల్ 2న ముగియనుంది. ఈ సందర్భంగా ఖాళీ కానున్న పోస్టులను ఎన్నికల ద్వారా భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది. ఇందులో భాగంగా నామినేషన్ల గడువు గురువారం ముగిసింది.
చివరిరోజు వైఎస్సార్సీపీ అభ్యర్థులుగా గొల్ల బాబూరావు, వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డి ముగ్గురు మాత్రమే నామినేషన్లు వేయగా వీరంతా ఏకగ్రీవం కానున్నారు. అసెంబ్లీలో రాజ్యసభ ఎన్నికకు కావల్సిన సంఖ్యాబలం లేకపోవడంతో పోటి నుంచి తప్పుకోవడం వల్ల వైసీపీ అభ్యర్థుల ఎన్నిక ఇక లాంఛనమే. ఈ మూడు స్థానాలతో వైఎస్సార్ రాజ్యసభ సభ్యుల సంఖ్య 8 నుంచి 11కు చేరనుంది.