Jogi Ramesh | ఏపీలో టీడీపీ కార్యకర్తలు మరోసారి రెచ్చిపోయారు. నిన్న వైసీపీ నేత అంబటి రాంబాబు ఇంటిపై దాడికి దిగగా.. ఇవాళ జోగి రమేశ్ ఇంటిపైకి వందలాది మంది దాడికి యత్నించారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేశ్ ఇంటి ముందు ఉన్న ఫ్లెక్సీలను పీకేశారు. ఇంటికి నిప్పు పెట్టారు. దీంతో ఇంట్లోని ఫర్నీచర్‌కు మంటలు అంటుకుని, దట్టమైన పొగలు ఎగిసిపడుతున్నాయి.
టీడీపీ శ్రేణులు దాడికి దిగిన సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని వారిని అడ్డుకునేందుకు యత్నించారు. అల్లర్లు మరింత చెలరేగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా, టీడీపీ కార్యకర్తల దాడి సమయంలో జోగి రమేశ్ ఇంట్లో లేరని పోలీసులు తెలిపారు.
BREAKING NEWS
ఏపీలో కొనసాగుతున్న టీడీపీ గూండాల అరాచకాలు.
ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇంటిపై రాళ్లు, కర్రలటు వందలాది టీడీపీ గూండాల దాడి.
రాళ్లు వేస్తున్నా చోద్యం చూస్తున్న పోలీసులు.
జోగి రమేష్ ఇంటికి నిప్పు పెట్టిన పచ్చ గూండాలు. pic.twitter.com/JPVMz39rIW
— 𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠 (@YSJ2024) February 1, 2026
Visuals at Jogi Ramesh House ! pic.twitter.com/RYT7k7NAJe
— YSRCP Europe (@YSRCPEurope) February 1, 2026
విజయవాడ
మాజీమాంత్రి వైస్సార్సీపీ నాయకులు జోగి రమేష్ గారి ఇంటిపై టీడీపీ గుండాలు దాడి.
ఇంటి మీదకు రాళ్ళు కర్తలు విసురుతున్న టీడీపీ గుండాలు #TDPGoons pic.twitter.com/MG4XiK9lIE— We YSRCP (@we_ysrcp) February 1, 2026
జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులతో నిప్పు పెట్టిన టీడీపీ శ్రేణులు
రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారిపోతున్నాయి.
శాంతి భద్రతలను కాపాడాల్సిన వారే హింసను ప్రోత్సహిస్తున్నారు.
ఇదంతా దేనికి సంకేతం???#TDPAntiKapu #CBNFailedCM pic.twitter.com/to3F2phx4Q
— Drakshayani Pantapalli (@DrakshayaniPC) February 1, 2026