Audio Viral | టీడీపీ నేతల వేధింపులకు గర్భిణీ బలైంది. అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో టీడీపీ కార్యకర్త భార్య శ్రావణి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన భర్త వేరే వాళ్లతో పడుకోబెట్టాలని చూస్తున్నాడని, పోలీసుల దగ్గరకు వెళ్లినా న్యాయం జరగకపోవడంతో చనిపోతున్నానని వాయిస్ రికార్డు చేసి ఆత్మహత్య చేసుకుంది. తన చావుకు పోలీసులు, ఈ టీడీపీ ప్రభుత్వమే కారణమని అందులో కన్నీరుమున్నీరుగా విలపించింది.
కల్యాణదుర్గం టీడీపీ కార్యకర్త శ్రీనివాస్‌కు మూడేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన శ్రావణితో వివాహమైంది. పెళ్లయినప్పటి నుంచి భర్తతో పాటు అత్తమామలు వేధిస్తున్నారు. అదనపు కట్నం తీసుకురావాలని ఒత్తిడి చేసేవారు. చివరకు ఆమెను చంపేందుకు కూడా కుట్రలు చేశారని గతంలో శ్రావణి తన తల్లిదండ్రులకు చెప్పింది. అత్తింటి వేధింపులపై కల్యాణదుర్గం పట్టణ పోలీసులకు శ్రావణి ఫిర్యాదు కూడా చేసింది. కానీ పోలీసులు కూడా పట్టించుకోకపోవడంతో చివరకు ఆత్మహత్యకు పాల్పడింది. చనిపోయే ముందు తన బాధనంతా ఫోన్లో రికార్డు చేసింది.
తన చావుకు స్థానిక టీడీపీ నాయకుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ వైపీ రమేశ్, వైస్ చెర్మన్ శర్మస్ వలీ, కల్యాణ దుర్గం పోలీసులే కారణమని శ్రావణి పేర్కొంది. తన భర్త వేధింపులపై ఫిర్యాదు చేస్తే.. టీడీపీ నేతల ఒత్తిడి కారణంగానే పోలీసులు పట్టించుకోలేదని విలపించింది. తన కడుపులో పెరుగుతున్న బిడ్డతో పాటు తాను ఈ లోకం నుంచి వెళ్లిపోతున్నానని.. కనీసం తన మొదటి బిడ్డకైనా న్యాయం చేయాలని వేడుకుంది. భర్త శ్రీనివాస్‌తో పాటు కల్యాణదుర్గం నేతలు రమేశ్, శర్మాస్‌పై చర్యలు తీసుకోవాలని కోరింది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై ఎస్పీ జగదీశ్ విచారణకు ఆదేశించారు.
టీడీపీ నాయకులు వేధింపులు, పోలీసుల నిర్లక్ష్యానికి గర్భిణి బలి
ఈ టీడీపీ ప్రభుత్వం, పోలీసులే నా చావుకి కారణం అంటూ వాయిస్ రికార్డ్ చేసి ఉరేసుకున్న శ్రావణి అనే మహిళ
నా భర్త వేరే వాళ్ళతో నన్ను పడుకోబెట్టాలని చూస్తున్నాడు అంటూ కన్నీరుమున్నీరైన శ్రావణి
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం… pic.twitter.com/T8BVJ0wB6A
— Telugu Scribe (@TeluguScribe) August 15, 2025